ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
లాక్‌డౌన్, ధాన్యం సేకరణ, కల్తీ విత్తనాల నిరోధం, తదితర అంశాలపై చర్చించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. హూఫూష్టంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్, వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, వి త్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ ఈ నెల 30 అమలులో ఉంది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేదా అన్న విషయంపై ఆది వారం రోజునే నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత తీవ్రత, పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకో నుంది.
కొవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలు, సదుపా యాలపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఇంటింటి జ్వర సర్వే, వ్యాక్సి నేషన్‌పై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలిసింది. అవసరాలు పెరిగిన దృష్ట్యా వైద్య ఆరోగ్య, హోం శాఖలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, ఖర్చు తగ్గే శాఖలకు తగ్గింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్‌లో సమీక్షించనున్నారు. వానాకాలం పంట సీజన్ ప్రారంభమవుతోన్న తరు ణంలో పంటల మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది.
Telangana Cabinet Meeting on 30th May
ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) May 26, 2021