Sunday, February 2, 2025

5న కేబినెట్, అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కులగణన పైసబ్ కమిటీ ఇచ్చే నివేదికను కేబినెట్ ముం దు పెడతామని, ఈనెల 5వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం ఉంటుందని, అదే రోజు న మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే బిసి రిజర్వేషన్లు, కులగణనపై సుదీర్ఘ చర్చ జరుపబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేప థ్యంలో నేడు (ఆదివారం), రేపు (సోమవారం) కులగణన సర్వేపై కేబినెట్ సబ్ కమి టీ సమావేశం కానుందని ఆయన పేర్కొన్నా రు. 5వ తేదీన కులగణనపై కేబినెట్‌లో ప్రభు త్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి పొ న్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం, కమాండ్ కం ట్రోల్ సెంటర్ వద్ద శనివారం రాత్రి మంత్రు లు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు మీ డియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమగ్ర ఇం టింటి కుటుంబ సర్వే, కులసర్వేకు సంబంధించి శాసనసభలో తీర్మానం చేసుకొని ప్ర త్యేక కమిషన్ వేసుకున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి అ య్యిందన్నారు. అది కార్యరూపం దాల్చడానికి ఈ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న ప్రిగేసివ్ యాక్టివిటీస్‌పై చర్చించామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 05వ తేదీన మధ్యాహ్నాం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు, కులగణన నివేదికపై చర్చకు పెట్టి ప్రజాస్వామిక విధానం ద్వారా వాటిని ముందుకు తీసుకుపోవాలన్నదే తమ నాయకుడి ఉద్దేశ్యమని మంత్రి పొన్నం తెలిపారు. తమ పార్టీ లక్ష్యం దేశంలోనే ఒక చారిత్రాత్మక మార్పు తీసుకురావడమేనని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తానికి రోల్ మోడల్ కావాలన్న ఉద్ధేశ్యంతో అన్నిరకాల అంశాలను చర్చించడం జరిగిందన్నారు.

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశాం: మంత్రి దామోదర
‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సిఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీ వేశారని, సబ్ కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించారని ఆయన తెలిపారు. ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇవ్వబోతుందన్నారు. ఆ రిపోర్టుపై కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసింది: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు అన్యాయం జరిగిందని, కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే కేటాయించారని ఆయన ఆరోపించారు. ఎన్‌డిఏ భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు అధికంగా దక్కాయని ఆయన అన్నారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆ మేరకు నిధులు విదల్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని, గతంలో కంటే 12 శాతం నిధులు పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణమని ఆయన ఆరోపించారు. బిజెపికి 8 మంది ఎంపిలను ఇచ్చినా తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. బీహార్, ఢిల్లీ, ఎపి, గుజరాత్‌లకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా అని ఆయన ప్రశ్నించారు.

సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు పలుసార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సాయం అభ్యర్థించారని అయినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. మెట్రో-2 ప్రాజెక్టు 76.4 కిలోమీటర్ల విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17.212 కోట్లు కేటాయించాలని కోరగా రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు సిఎస్‌ఎంపి కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా అన్యాయం చేశారన్నారు. మూసీనది హైదరాబాద్ పరిధిలో 55కిమీలు ప్రవహిస్తోందని, మురుగు కూపంగా మారిన ఈ నది పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశ పరిచిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్‌ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదని, గోదావరి, -మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదన్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఈజిఏ పథకం అమల్లో వెసులుబాటు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు.

నేడు మధ్యాహ్నాం కులగణన నివేదిక అందజేత
నేడు (ఆదివారం) మధ్యాహ్నాం రెండు గంటలకు కులగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అధికారులు అందచేయనున్నారు. సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాంబర్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కో చైర్మన్ దామోదర రాజనర్సింహా, సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లురవిలు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News