Monday, December 23, 2024

ఈ నెల 9న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 09వ తేదీన కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.

సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి, విధానాలపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్టుగా సమాచారం. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్టుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించి అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News