Monday, December 23, 2024

ఆగస్టు 1న తెలంగాణ మంత్రివర్గం భేటీ

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 1వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 2వ తేదీన ముగియనున్నాయి. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టగా బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31వ తేదీన అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆగస్ట్ 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందే తెలంగాణ కేబినెట్ భేటీ కానుండటం ఆసక్తిగా మారింది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏంటన్నది తెలియనప్పటికీ జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్‌కు సంబంధించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News