Tuesday, November 5, 2024

ఈనెల 12వ తేదీన సిఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 12వ తేదీన జరుగనుంది. ఈ కేబినెట్‌లో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సచివాలయంలో మంగళవారం ఉదయం 12 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా నిర్దిష్టమైన ఎజెండా రూపొందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా భద్రాచలంలో ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల మేర రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు.

దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మిలో నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్‌లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదించుకోవడంతో పాటు మరిన్ని పథకాలను ప్రారంభించేలా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News