Sunday, January 19, 2025

రేపు కేబినేట్ భేటి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ భవనంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి శనివారం కేబినేట్ హాల్‌తో పాటుగా మంత్రులు, అధికారులకు సంబంధించిన డైనింగ్ హాల్ సంసిద్దత, ఇతర ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిసింది. ఈ కేబినేట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు అనువైన షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని సమాచారం.

ఇతర పరిపాలనాపరమైన అంశాలు, టేబుల్ ఎజెండాగా వచ్చే అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనుంది. అనేక కీలకమైన అంశాలపై కేబినేట్‌లో చర్చించి ఆమోదం పొందుతారు. కేబినేట్ సమావేశంలో చర్చకు రానున్న అంశాలపై సంబంధిత ఫైళ్ళను సిద్దం చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News