రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ ధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కే బినెట్ భేటీ పలు కీలక అంశాలు, వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సంబంధిత అంశా లు, ప్రభుత్వ చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది. అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులపై అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఉధృతంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై కూడా మంత్రివర్గం అంచనా వేయనుంది.
యుద్ధ ప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై మం త్రివర్గం చర్చించనుంది. అలాగే టిఎస్‌ఆర్‌టిసికి సంబంధించిన అంశాలపై కేబినేట్‌లో చర్చించనున్నారు. ఆర్‌టిసి ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, ఇతర తదితర అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయపరమైన అంశాలు సహా ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కేబినెట్ భేటీలో దాదాపు 40 నుంచి 50 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.