Friday, November 22, 2024

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

అజెండాలో 125అంశాలు పలు కీలక నిర్ణయాలు
తీసుకునే అవకాశం ప్రగతిభవన్‌లో మీటింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మ ధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది. సిఎం కెసిఆర్ అధ్య క్షతన జరిగే సమావేశంలో రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణపై ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్రం నుం చి రావా ల్సిన పెండింగ్ నిధులతో పా టు ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో పూడ్చు కోవాల్సిన లోటు తదితర అం శాల పై మంత్రివర్గ సమావేశం కూలంకషంగా చర్చిం చనుం ది. మంత్రివర్గ స మావేశానికి ఇప్పటికే భారీ అజెండా తయా రైనట్లుగా తెలుస్తోంది. ఇందు లో 125 అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య సమావేశం ప్రారంభం అయ్యే సమయానికి మరింతగా పెరగవచ్చు. ఇవి కాకుండా టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపై చర్చించి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం . ఇవి కాకుండా గత సమావేశాల్లో అజెండాలో చేర్చి…చర్చకు రాని వాటికి కూడా ఈ సమావేశంలో మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా రెండు, మూడు కీలక నిర్ణయాలు నేటి మంత్రివర్గ సమావేశంలో తీసుకునే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వీటిపై లీకులు బయటకు రాకుండా సిఎంఓ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News