Monday, April 14, 2025

రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కేబినెట్ బుధవారం సమావేశం కానున్నది. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో భేటీ అయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 11:45 నిమిషాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నదనేది ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News