Monday, December 23, 2024

రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 2 గ్యారంటీలు, ఇతర అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది. రూ. 500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 8తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మంత్రి వర్గం అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. బడ్జెట్ ప్రతిపాదనలు, గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News