Friday, November 22, 2024

రైతులే ఎజెండాగా రేపు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం(జూన్ 21) సాయంత్రం 4 గంటలకు స చివాలయంలో జరగనున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రుణమాఫీ, రైతుభరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. పంటల బీమా అర్హతలపై మంత్రుల బృందం చర్చించనున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దాం తో పాటు ధాన్యానికి రూ.500 బోనస్, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహం, ఉద్యానపంటల సాగుకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణపై మంత్రివర్గ సమావేశం లో చర్చించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా సాగునీటి రంగానికి ప్రాధాన్యం, ప్రాజెక్టుల సత్వర పూర్తి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే విద్యాకమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News