Sunday, January 5, 2025

రైతు భరోసాపై మరోసారి కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

- Advertisement -
- Advertisement -

రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఈ క్రమంలో గురువారం సచివాలయంలో రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం అయ్యింది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధివిధానాలపై సిఫారసులను సబ్‌కమిటీ  ఖరారు చేయనుంది. దీంతో ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున రెండు విడుతల్లో సంవత్సరానికి రూ.10 వేలు రైతుల ఖాతాల్లో వేసింది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.7500 చొప్పు సంవత్సరానికి రూ.15 వేలను ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News