Friday, July 5, 2024

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సభ్యులుగా ఉండనున్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు బ్యాంకుల ద్వారా పంటల సాగు కోసం పెట్టుబడి కింద తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు మాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే తీసుకుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రుణమాఫీకి విధివిధానాలను ఖరారు చేసేందుకు తాజాగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News