Thursday, October 17, 2024

ఈనెల 23న రాష్ట్ర కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మూసీ ప్రక్షాళన, రైతు భరోసా విధి, విధానాలపై ఈ భేటీలో చర్చించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరుతో రైతన్నలకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతుభరోసా గైడ్‌లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా గైడ్‌లైన్స్‌ను ఫైనల్ చేసినట్టుగా సమాచారం. దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఇదిలా ఉండగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్)కు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించే వారికి ఆర్డినెన్స్‌తో చెక్ పెట్టారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955లో 374 బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్డినెన్స్‌కు కొనసాగింపుగా జీహెచ్‌ఎంసి చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్‌ఆర్, హైడ్రా పరిధిలో మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారాలను బదాల యించింది. దీంతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కలు, జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించ డానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి. ఫలితంగా ఇక నుంచి నోటీసులు జారీ చేయడం, మౌఖిక ఆదేశాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చేయడానికి, సీజ్ చేయడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News