- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 48 గంటల పాటు ప్రచారాలు చేయకూడదని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం బంద్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. స్థానికులు కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు వెళ్లిపోవాలని ఇసి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30న పోలింగ్ జరగగా డిసెంబర్ 3 ఫలితాలు వెలువడుతాయి.
- Advertisement -