Sunday, January 19, 2025

కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన క్రమంలో వికాస్ రాజ్ బిఆర్కే భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం లక్షా 80వేల మంది సిబ్బంది అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో 90వేల పోలింగ్ కేంద్రాలను ఏర్నాటు చేశామని.. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. 85ఏళ్లు దాటిన వాళ్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చని తెలిపారు. ఇంటి దగ్గర ఓటింగ్ కోసం ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మొత్తం 1.85లక్షల మంది వృద్ధులు ఉన్నారని తెలిపారు. గతేడాది 2.09లక్షల మంది పోస్టల్ ఓట్లు వేసినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News