Wednesday, January 22, 2025

ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించిన హైకోర్టు సీజే

- Advertisement -
- Advertisement -

Telangana Chief Justice honors Traffic Home Guard

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శుక్రవారం ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (5066)అష్రఫ్ అలీని చీఫ్ జ‌స్టిస్ త‌న వాహ‌నాన్ని ఆపి.. పుష్ప‌గుచ్ఛం అందించారు. అంతే కాకుండా అష్ర‌ఫ్ అలీ ప‌నితీరును మెచ్చుకుంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.  చీఫ్ జ‌స్టిస్ ప్ర‌తి రోజు త‌న అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తుంటారు. ఆ స‌మ‌యంలో అబిడ్స్‌లోని బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హం వ‌ద్ద ట్రాఫిక్ హోంగార్డ్ అష్ర‌ఫ్ అలీ విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు. అష్ర‌ఫ్ త‌న విధులను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించ‌డాన్ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌తి రోజు గ‌మ‌నించేవారని చెప్పారు. ఈ క్ర‌మంలో అత‌ని ప‌నితీరు ప‌ట్ల ఆక‌ర్షితులైన సీజే అష్ర‌ఫ్ అలీకి పుష్ప‌గుచ్ఛం అందించి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News