Sunday, January 19, 2025

తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేల్చేశారు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణా ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ సమావేశమయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిపైనా, డిప్యూటీ ఉపముఖ్యమంత్రులపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరాక రాహుల్, వేణుగోపాల్ వెళ్లిపోయారు. శివకుమార్ మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుని, అధిష్ఠానం ఖరారు చేసిన ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారు. డిప్యూటీ ముఖ్యమంత్రుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News