Wednesday, January 22, 2025

మహిళను వేధించిన సిఐడి ఎస్పిపై కేసు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న సిఐడి డిఎస్పిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సిఐడి డిఎస్పి కిషన్‌సింగ్ తనను వేధిస్తున్నాడంటూ మహిళ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ను తీసుకున్న పోలీసులు విచారణ చేసి కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్ సింగ్‌తో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ మహిళా ఉద్యోగికి పరిచయం ఏర్పడింది.

తాను సిఐడిలో పని చేస్తున్నానని చెప్పిన కిషన్ సింగ్ కావాలనే ఆమె మొబైల్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి కిషన్‌సింగ్ మహిళకు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపించి వేధిస్తున్నాడు. అయినా కూడా భరించిన మహిళ ఇటీవలి కాలంలో కిషన్ సింగ్ మహిళను చీరకట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News