Sunday, January 19, 2025

నేడు ‘పది’ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ఇటీవల పూర్తి కాగా, వారం రోజుల పాటు ఫలితాల డీ -కోడింగ్ అనంతరం ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌సైట్లు చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News