దేశంలో 24గంటల కరెంటు ఇచ్చింది తెలంగాణ సిఎం కేసిఆర్ ఒక్కడే
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24గంటల కరెంటు ఇచ్చింది సిఎం కేసిఆర్ ఒక్కడే అని తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా తాండూరు పట్టణంలోని మెట్రో పంక్షన్‌హాల్లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పవర్ హాలిడేస్ ఉంటే తెలంగాణలో మాత్రం 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత కేసిఆర్‌దే అన్నారు. నాడు ఆంద్ర పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలంగాణ అందకారం అవుతుందని అన్నారని, నేడు సాధించుకున్న తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ పనులకోసం రూ.200కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతం అని కొనియాడారు. అదే విధంగా ఒక పక్క మోటార్లకు మీటర్‌లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టకుండా మరోసారి రైతుల పక్షాన నిలచింది అని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, ఆర్‌డిఓ అశోక్‌కుమార్, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ దీపానర్సింలు, తాండూరు జడ్పీటీసి మంజూల, పెద్దేముల్ ఎంపిపి అనురాధరమేష్, పట్టణ అధ్యక్షులు నయ్యింఅప్పు, శ్రీనివాస్‌చారి, నర్సింలు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.