హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సిఎస్ సోమేష్ కుమార్ కు సిఎం కెసిఆర్ ఆదేశించారు. కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ ఆదేశించారు. రెడ్ అలర్డ్ దృష్ట్యా పరిస్థితులు సమీక్షిస్తుంటానని తెలిపారు. పరిస్థితులను బట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. జిల్లాలల్లో స్థానిక నేతలు.. ప్రజలు రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని కెసిఆర్ ఆదేశించారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సిఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.
ప్రజల రక్షణ కోసం అప్రమత్తంగా ఉండండి: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -