Monday, December 23, 2024

సిఎం ఎవరనేది ఖర్గేనే నిర్ణయిస్తారు: డికె శివ కుమార్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో డికె శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వేణుగోపాల్ హాజరయ్యారు. సిఎల్‌పి ఏకవాక్య తీర్మానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి అందిస్తామని డికె శివకుమార్ తెలిపారు. సిఎల్‌పి ఏకవాక్య తీర్మానంపై నిర్ణయం ఖర్గేనే తీసుకుంటారని, సిఎల్‌పి నేత, సిఎం ఎవరనేది ఎఐసిసి అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ కూర్పుపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు, ఎంఎల్‌ఎలతో మాట్లాడిన అంశాలు నివేదిక అధిష్టానానికి అందిస్తామని, సమావేశం తరువాత పార్టీ అధ్యక్షుడి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఖర్గే నివాసంలో సమావేశానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News