Saturday, November 9, 2024

గవర్నరును కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేబినెట్ ను విస్తరించొచ్చు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ను సోమవారం కలుసుకున్నారు. రాజ్ భవన్ లో ఆయనని కలుసుకున్నారు. రానున్న కొన్ని రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉండనున్నదన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి గత వారం ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ ప్రధాన నాయకులతో కేబినెట్ విస్తరణ గురించి చర్చించారని తెలిసింది. ఐదు నుంచి ఆరుగురు మంత్రులను కేబినెట్ లోకి తీసుకోవడం ఖరారయిందని తెలుస్తోంది. మంత్రి పదవులు వస్తాయని చాలా మంది గత ఆరు మాసాలుగా ఎదురుచూస్తున్నారు.

రేవంత్ రెడ్డి, ఆయన 11 మంది కేబినెట్ కొలీగులు 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్రానికి గరిష్ఠంగా 18 మంది మంత్రులు ఉండొచ్చు.

ఇదిలావుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నఅసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి గవర్నర్ కు వివరించారని తెలుస్తోంది. చర్చల సందర్భంగా నామినేటెడ్ ఎంఎల్ సిల అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన ఎం.కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నామినేషన్లను కొట్టేసింది. గవర్నర్ ఉత్తర్వును 2023 సెప్టెంబర్ 19న హైకోర్టు కొట్టేసింది. బిఆర్ఎస్ నాయకులు శ్రవన్ దాసోజు, కె. సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరించింది. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గవర్నర్ కోటా కింద వారి నామినేషన్లను తిరస్కరించారు. గవర్నర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బిఆర్ఎస్ నాయకులు హైకోర్టులో రిట్ పిటీషన్లను దాఖలు చేశారు. గవర్నర్ ఎంఎల్ సిలను నియమించేలా వారు అప్పీలు చేసుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News