Monday, January 27, 2025

పదేళ్లు నేనే సిఎం

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి నుంచే రైతు భరోసా

భూమిలేని వ్యవసాయ
కూలీలకు రూ.12వేలతో
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ
ఇళ్లు, రేషన్ కార్డు త్వరలో
సన్నబియ్యం పంపిణీ నాకు
అండగా నా సోదరులు
పనిచేస్తుంటే కళ్లలో నిప్పులు
పోసుకుంటున్నారు ప్రతిపక్ష
నేత అసెంబ్లీకి రాని దుస్థితి
విపక్షనేతగా బాధ్యత
లేనప్పుడు కెసిఆర్‌కు ఆ పదవి
ఎందుకు?: సిఎం రేవంత్‌రెడ్డి
చంద్రవంచలో నాలుగు
పథకాలు ప్రారంభం,
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్/నారాయణపేట/ కోస్గి: పదేళ్లు రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫామ్ హౌ స్‌లో ఉండి గడీలు కట్టుకొని పాలన చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ కుటుంబానికే పదవులు దక్కాయి తప్ప మిగ తా వారెవరికీ దక్కలేదని విమర్శించారు. కేటీఆర్.. మీ ఇంట్లో అందరూ పదవులు తీసుకున్న రు.. ఏ పదవులు తీసుకోకుండా మా కుటుంబ స భ్యులు ప్రజల కోసం సేవ చేస్తున్నారు.. మా కు టుంబ స భ్యులు నాకు అండగా ఉంటే కళ్లలో ని ప్పులు పో సుకుంటున్నారు.. నేను నా కుటుంబం లో ఎవరికైనా పదవి ఇచ్చానా..?.మా కుటుంబ సభ్యులు ని స్వార్థంగా పనిచేస్తుంటే కేసీఆర్ కు టుంబం తప్పుపడుతుందోంది.. దోపిడికి మీలాగా మేం పోటీ పడం.. కష్టాల్లో ప్రజలకు తోడుగా నిలబడే నాయకత్వం మాది.. దోచుకునే నీతి మీది.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు నా కుటుంబం లేదు అని అన్నా రు.

నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంతంగా కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టానని పునరుద్ఘాటించారు. కొండంగల్ నియోజకవర్గం నుంచి నాలుగు పథకాలు రాష్ట్రానికి అం కితం ఇస్తున్నామన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నా రాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు. ఇందిర మ్మ ఇళ్లకు సంబంధించిన రూ. 11.80 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. 734 మందికి రైతు భరోసా చెక్కులను రేవంత్ పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం రోజున 4 సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామన్న రేవంత్ రెడ్డి ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు.

ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బు లు జమకావన్న ఆయన, అర్ధరాత్రి 12 దాటగానే రైతు ల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమవుతాయని వివరించారు. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, వారి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తీసుకువచ్చామని రేవంత్ వివరించారు. కూలీ పనిచేసే పేదలకు ఆ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నామని తెలిపారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతటా రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకే విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, అలా చేసిన రాష్ట్రం మరొకటి లేదని వివరించారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు నెరవేర్చామని రేవంత్ రెడ్డి వివరించారు. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

రైతులకు ఉచిత కరెంట్‌ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారేనని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగాఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలో ప్రారంభిస్తున్నామన్నారు. స్వాతం త్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు కొడంగల్‌నియోజకవర్గానికి జరగాల్సిన న్యాయం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను ఎమ్మెల్యే గా ఎన్నుకుంటే సోనియా గాంధీ నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా నియమించారని, ముఖ్య మంత్రి అయ్యాక కొడంగల్ కు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నానన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేశారని, యూపీఎ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశ వ్యాప్తంగా72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారన్నారు. ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు. ఆగస్టు 15న 22.50 లక్షల రైతులకు21 వేల కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తి చేశామని, మొదటి విడత రైతు భరోసాలో భాగంగా దాదాపు 7 వేల కోట్ల రూపాయలనురైతుల ఖాతాలో వేశామన్నారు.

ఏడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు :

దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 120 కోట్ల ఆడబిడ్డలు 13 నెలలుగా ఆర్టీసీ లోమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఇప్పటి వరకు ఆర్టీసీకి 4000 కోట్లు ప్రభుత్వం చెల్లించిదని చెప్పారు. పేదలను ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, గతంలో రైతు భరోసా సాయం రూ. 5000 ఉంటే ఈ సారి ఎకరానికి ఏడాదికి రూ.12 వేలకు పెంచామన్నారు. ప్రతి ఏడాది 20 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తామన్నారు. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా సొమ్ము పడుతుందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది రైతులను ఆదుకోవడం కోసం చంద్రవంచ గ్రామం నుంచి రైతు భరోసా ను ప్రారంభిస్తున్నామని, నా పాదయాత్రలో అనేక మంది భూమి లేని పేదలు తమకు సాయంఅందించాలని కోరారని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ప్రతి యేడాది 12 వేల రూపాయలను చెల్లిస్తామని, 10 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా ఆదుకుంటామన్నారు. రాత్రి 12 గంటల తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు పడతాయన్నారు.

కొడంగల్‌లో 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారని, 2004 నుంచి 2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఒక్క కొడంగల్ లో 34 వేల ఇళ్లు పేదలకు ఇప్పించగలిగామన్నారు. కొడంగల్ కు పెద్ద ఎత్తున ఇళ్ల కేటాయింపు పైన కేసీఆర్ కు కడుపు మండి సీబీసీఐడీ విచారణ వేశారని, కేసీఆర్ హయాంలో ఎవరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 31 వరకు కొడంగల్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని, కొడంగల్ లో ప్రతి పేదవాడిని ఇంటిని వాడిని చేసే బాధ్యత మీ సోదరుడి గా తీసుకుంటానన్నారు. వచ్చే నాలుగేళ్లలో 15 నుంచి 20 వేల ఇళ్లు కొడంగల్ లో ఇస్తామని, 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ కు, అమెరికాలో చదివి వచ్చిన కేటీఆర్ కు కనీసం పేదలకు రేషన్ కార్డుఇవ్వాలన్న జ్ఝానం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామన్నారు. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, గత పదేళ్లు గాకొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.

గ్రామ సభ లు పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నామని, గత పదేళ్లలో ఎప్పుడైనా గ్రామాల్లో అధికారులనుచూశారా అని సీఎం ప్రశ్నించారు. ప్రజలకు జవాబు దారీతనంగా ఉండాలనే అధికారులను గ్రామాలకు పంపించామని, ప్రజల దగ్గరకే ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారన్నారు. ప్రజలే రాజులు, పాలకులు..తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రైనా , మంత్రి అయినా ప్రజల దగ్గరకే వెళ్లాలన్న మార్పు తీసుకువచ్చామని చెప్పారు. గ్రామ సభల్లో అక్కడక్కడ గందరగోళం సృష్టిస్తున్నారని, కొంతమందిని ఉసిగొల్పి చిల్లర మల్లరపంచాయతీలు పెడుతున్నారని, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం..వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. చెప్పింది చేసి చూపిస్తామని, కాశేశ్వరం కూలిపోయినా ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించామని, సన్నవడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. పదేళ్లు అయినా పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేలదని, కొడంగల్,నారాయణపేట ఎత్తిపోతల పథకం మొదలు కాలేదన్నారు. కృష్టా జలాలను కొడంగల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే కాళ్ల లో కట్టె పెడుతున్నారని, గత పాలకులు ఫామ్ హౌస్ లు, వాళ్ల సంపాదన తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే వారి మనుగడ ఉండదని అడ్డు పడుతున్నారన్నారు.

ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకపోతే ఏమనాలి

13 నెలల్లో ఒక్క రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకపోతే ఏమనాలన్నారు. ఆయనకు బాధ్యత లేదా..?. బాధ్యత లేకపోతే ఆయనకు పదవి ఎందుకు ..? అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమల కోసం1300 ఎకరాల భూసేకరణ చేశామని, ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని పరిశ్రమలు తీసుకు వస్తుంటే అధికారులపైనా దాడులు చేయించారని ఆరోపించారు. ఎప్పటికీ మనం వెనుకబడే ఉండాలా..? కొడంగల్ యువకులు ఇంకా లుంగీలు కట్టుకు బస్టాండుల్లో తిరగాలా…కొడంగల్ కు మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, జూనియర్‌కాలేజీలు వద్దా?..కేసీఆర్, ఆయన మనుషులు కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి లబ్దిదారుడికి మార్చి 31 నాటికి పథకాలన్నీ అమలు అవుతాయన్నారు. 22,500 కోట్ల తో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. వ్యవసాయ యోగమైన భూములకు మార్చి 31 లోపు రూ. 10 వేల కోట్లు రైతులకు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో భాగంగా 10 లక్షల కుటుంబాలకు 6 వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. వలస పోయిన కుటుంబాలు కూడా సొంతూరులో రేషన్ కార్డులు తీసుకోవాలని, దావోస్ నుంచి లక్షా డైబ్బై ఎనిమిది వేలకోట్ల రూపాయలపెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News