Wednesday, January 22, 2025

సీతక్కను సిఎం చేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ను నిర్వహకులు సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పందించారు. అమరావతి, పోలవరం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రేవంత్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రేవంత్ అని తెలిపారు. ఎన్నికల ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కాంగ్రెస్ లో లేదన్నారు.  ఒకవేళ కాంగ్రెస్‌లో మహిళతోపాటు గిరిజనులకు ఇవ్వాలనుకుంటే సిఎం రేసులో సీతక్క మొదటి వరసలో ఉంటారని రాజకీయ ప్రముఖులు అనుకుంటున్నారు. ఆమె టిడిపిలో నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో సీనియర్లు అడ్డుచెప్పే అవకాశం కూడా ఉంది.

Also Read: యుపిలో దారుణం.. దళిత యువకుడితో చెప్పులను నాకించి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News