హైదరాబాద్: తెలంగాణాలో మూడో శాసనసభ ఏర్పాటైంది. ఈ మేరకు కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయింది. ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్, కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ గవర్నర్ తమిళిసైకి గెజిట్ ను సోమవారం మధ్యాహ్నం అందజేశారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సీఎల్పీ నాయకుడి ఎంపిక నిర్ణయాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఉదయం జరిగిన సిఎల్ పీ సమావేశం ఏకవాక్య తీర్మానం చేసింది.
అయితే కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేయడం ఖాయమని తెలుస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా, మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఈమేరకు రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారోత్సవానికి కావసిలసిన కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామగ్రిని తెప్పించారు.