Thursday, January 23, 2025

కర్నాటకలోని విజయాన్ని వేడుకచేసుకున్న తెలంగాణ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక ఎన్నికలో సాధించిన విజయాన్ని శనివారం తెలంగాణ కాంగ్రెస్ వేడుక చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధానకార్యాలయం గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఈ వేడుకలు చేసుకుంది. పార్టీ కార్యకర్తలు డ్రమ్‌బీట్స్‌ల మధ్య డ్యాన్స్ చేశారు. పైగా పార్టీ జెండా, కాంగ్రెస్ నాయకుల కటౌట్‌లు (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) పట్టుకుని మరీ డ్యాన్స్ చేశారు. అంతేకాక పటాసులు కూడా కాల్చారు. కొందరు పార్టీ కార్యకర్తలైతే బైక్ ర్యాలీ కూడా తీశారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జీ మాణిక్‌రావు థాక్రే, ఇతర నాయకులు గుడిలో పూజలు నిర్వహించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ మంచి పనితీరును కనబరచనున్నదని వారు ఆశాభావంతో ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News