Monday, December 23, 2024

ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం సైతం ఊపందుకుంది. ఆ పార్టీ గత ఆదివారం మొదటి విడుతగా 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులోని గేటర్‌లోని పరిధిలో ఉన్న 24 నియోజవర్గాలకు గాను 14 ప్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో వారంతా ప్రచారం నిమగ్నమైయ్యారు. మరోవైపు బుధవారం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీలు ములుగు నియోజకవర్గం బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టడంతో సీట్లు ఖరారైన అభ్యర్థులు సైతం బుధవారం గ్రేటర్‌లో పలు ప్రాంతల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న హనుమంతరావు, కుత్బుల్లాపూర్‌లో కోలన్ హనుమంత్‌రెడ్డి, ఉప్పల్ లో ఎం. పరమేశ్వర్‌రెడ్డి, ముషీరాబాద్ లో ఎం. అంజన్ కుమార్ యాదవ్, సనత్‌నగర్‌లో డాక్టర్. కోటా నీలిమా, నాంపల్లి లో ఫిరోజ్‌ఖాన్, గోషామహాల్‌లో ఎం. సునీత మలక్‌పేట్‌లో షేక్ అక్బర్, చంద్రాయణ్‌గుట్ట నుంచి బోయ నాగేష్, సికింద్రాబాద్‌లో ఎ.సంతోష్ కుమార్‌లు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News