Sunday, January 19, 2025

సిఎం అభ్యర్థిపై ప్రతిష్టంభన..? ఢిల్లీకి చేరిన సీన్

- Advertisement -
- Advertisement -

సిఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీన్ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, దీప్‌దాస్ మున్షీ,ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రేలతో పాటు మరికొందరిని ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో వారంతా హుటాహుటీన ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సిఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించాలని నిర్ణయించింది. అయితే సోమవారం రాత్రి 8 గంటల తరువాత రాజ్‌భవన్‌లో సిఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారని ముందస్తుగా ప్రకటించడంతో రాజ్‌భవన్ దానికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోవడంతో, ఆ లోపే ఢిల్లీ నుంచి ఏఐసిసి పరిశీలకులకు పిలుపురావడంతో వారంతా వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News