Monday, January 20, 2025

రేవంత్ అధ్యక్షతన ఎన్నికల కమిటీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో సహా 26 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు ఎక్స్‌ఆఫీషియో సభ్యులతో కూడిన కమిటీని ఎఐసిసి ప్రకటించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ్మా, సంపత్ కుమార్, శ్రీధర్ బాబు, విహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, రేణుకా చౌదరి, సీతక్క, సునీతారావు, పొంగులేటి, ప్రేమ్‌సాగర్ రావు, షబ్బీర్ అలీ, పోదెం వీరయ్య, బలరాం నాయక్, వంశ్‌చంద్‌రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, వీరయ్య, అజార్ రుద్దీన్ లు ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News