Monday, December 23, 2024

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఇద్దరు ఇంఛార్జీలుగా కర్ణాటక నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమరానికి సన్నద్ధమౌతోంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఘన విజయం సాధించిన జోష్‌లో ఉంది. అక్కడి విన్నింగ్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. 2014 తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ఈ సారి దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీకి ఇద్దరు నేతలను అటాచ్ చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్‌ను రాష్ట్ర ఇన్‌ఛార్జీకి అటాచ్ చేసింది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ బాధ్యతలను పర్యవేక్షించిన పీసీ విష్ణునాథ్‌ను కూడా అదే పదవిలో అపాయింట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News