Friday, April 4, 2025

సోనియా గాంధీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బిసి కోటాపై బిజెపి, బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. బిసిలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసన సభలో చట్టం చేయడంపట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బిసి ఎమ్మెల్యేలు, ఎంపిలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో బిసి కోటాకు బిజెపి మద్దతు ఇచ్చిందన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేసన్లు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చామన్నారు. ఇడబ్యుఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు ప్రధాని మోడీ ఇవ్వలేదా? అని పొన్నం ప్రశ్నించారు. ఓసి జనాభాయే 10 నుంచి 12 శాతం ఉంటుందని, పది శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని అడిగారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దని గతంలోనే విజ్ఞప్తి చేశామని, ఇడబ్యుఎస్‌లకు ఇచ్చిన పది శాతంలో ముస్లింలు లేరా? అని నిలదీశారు. మరి ఇడబ్యుఎస్‌లో ముస్లిం రిజర్వేషన్లు బిజెపి ఎలా సమర్థించిందని అడిగారు. ఇడబ్యుఎస్‌లకు తెరుచుకున్న డోరు… బిసిలకు ఎందుకు తెరుచుకోవడంలేదని పొన్నం ధ్వజమెత్తారు.

బిజెపి మతం పేరుతో ఓట్లు అడుగుతోందని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది తమ ప్రభుత్వమేనని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన చేశామని, బిసిల రిజర్వేషన్ల విషయంలో ఒక మెట్టు దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఎఐసిసి పరిధిలోని అంశం అని, గుజరాత్‌లో బిసి జాబితాలోనే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. బిసిలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బిసి సంఘాలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News