Sunday, December 22, 2024

అసలైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగింది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సేవ్ కాంగ్రెస్ అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నివాసంలో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహా, తదితర కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో చర్చలు జరిపారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ గెలిచే ప్రాంతాల్లో ఏకాభిప్రాయం రాలేదన్నారు. 33 జిల్లాల్లో 26 అధ్యక్షులను వేసి ఏడు ఆపడం సరికాదన్నారు. కమిటీల్లో ఎక్కువ మందికి బయట నుంచి వచ్చిన వారికే స్థానం కల్పించడంతో అసలైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగిందన్నారు.

టిపిసిసి కమిటీల కూర్పులో తాము పాలుపంచుకోదల్చుకోలేదని చర్చలు జరిపారు. తనని కలుస్తున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని, కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉందని మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముల స్తంభాలుగా ఉన్న నేతలపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. దుష్ప్రచారం వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న భావన వ్యక్తమవుతోందన్నారు. తాము త్వరలో అధిష్టానాన్ని కలుస్తామని, ఇక్కడ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న పెట్టిన పోస్టులో కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News