Friday, December 20, 2024

కలవని చేతులు

- Advertisement -
- Advertisement -

టికెట్ వస్తే పోటి లేదంటే పక్క పార్టీ
పోటాపోటీగా టికెట్ల పైరవీలు
సమ న్యాయం చేసే నాయకత్వం కరువు
నామ్‌కే వాస్తేగా డిసిసిలు
రాష్ట్ర నాయకత్తం ప్రేక్షు పాత్ర
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సమైఖ్యంగా నాయకులు అంతా ఐక్యమత్యంగా చేతులు కలిపి అధికార పార్టీపై పోరాటం చేయాలి కాని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీపై తిరగబడదాం…తరమికొడదాం అంటు రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నవ్వులపాలువుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవలసి ఉంటుంది. చెవెళ్లలో హస్తం పార్టీ నిర్వహించిన సభతో పార్టీ క్యాడర్‌లో జోష్ వచ్చిన నాయకులు మాత్రం మనస్ఫూర్తిగా చేతులు కలిపి ముందుకు సాగక పోవడంతో అంతలోనే పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును క్షేత్రస్థాయిలో అమలు చేయవలసిన డిసిసిలు నామ్‌కేవస్తేగా మారడం…రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు ఒకే ప్రాంతంలో నిర్వహించడంతో మిగత నియోజకవర్గాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులు మమా అనిపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పాటు భవిష్యత్ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. రాష్ట్రస్థాయి కార్యక్రమాలపై బిజిగా ఉన్న ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత దూకుడుగా నిర్వహించేలా చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారు. జిల్లా నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులలో ఉన్న నాయకులు అయితే గాంధీభవన్ లేకపోతే స్వంత నియోజకవర్గాలకు పరిమితం అవడం తప్ప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసే ఒక్క నా యకుడు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో కనిపించిన పాపాన పోవడం లేదు. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డి మహేశ్వరంకు, వికారాబాద్ డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పరిగికి, మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు అయితే రేవంత్ రెడ్డి కార్యక్రమంలో లేదంటే మల్కాజ్‌గిరి పరిమితం అవ్వడం తప్ప తమ జిల్లా పరిధిలోని మిగత నియోజకవర్గాలలో భారీ కార్యక్రమాలను నిర్వహించిన దాఖలాలలు నామమాత్రమే.
అయితే పోటి లేదంటే పక్క పార్టీ….
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది టికెట్ వస్తే పోటి చేద్దాం…లేదంటే మరోపార్టీలోకి చేరి ఎలాగైన ఈసారి శాసనసభ ఎన్నికలో పోటి చేసి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అనిపించుకోవాలన్న తాపత్రయంతో చాలా మంది కనిపిస్తున్నారు. చెవెళ్ల నియోజకవర్గం పరిశీలిస్తే టికెట్ కోసం సున్నపు వసంతం, షాబాద్ దర్శన్, భీంభరత్, రాచమల్ల సిద్దేశ్వర్,పుష్పలీల, సులోచన తదితరులు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. లోకల్ నాన్ లోకల్ పంచాయతీ ఇప్పటికే తెరమీదకు తీసుకువచ్చి స్వంత పార్టీలో కుంపట్లు తయారు చేసుకుని కనీసం మాట్లాడుకునే స్థాయిలో లేరు …రేపోమాపో టికెట్ ఎవరికి వచ్చిన ఒకరిద్దరు గులాబీ కండువ కప్పుకోవడానికి …ఒకరిద్దరు కాంగ్రెస్‌లో ఉండి వెన్నుపోటు పొడవడానికి సిద్ధ్దంగా ఉండగా కొంత మంది బిఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్ లేదా మరో పార్టీ గుర్తుపై పోటిచేయడానికి సిద్ధ్దంగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది. ఒక్క చెవెళ్లలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పొరపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం, షాద్‌నగర్, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం తదితర నియోజవర్గాలలో ఇలాంటి నా యకులు..ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎదైన సాద్యమే కాబట్టి టికెట్‌లు ఎవరికి వ చ్చిన మరో వర్గం రచ్చచేయడం సహజమే అయినప్పటికి టికెట్ వచ్చేవరకైన కలిసి పార్టీ కోసం పనిచేసే పరిస్థితులు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు.
దాదాపు అభ్యర్దుల ఖరారు…
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల ఎంపిక కొలిక్కివచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్,పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎల్.బి.నగర్ నుంచి మాజీ ఎంపి మదుయాష్కి గౌడ్, షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్‌లకు లైన్ క్లీయర్ అయిందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News