Monday, December 23, 2024

రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఎక్కువ పోటీ ఉండడంతో పలువురు ఆశావాహులను ఢిల్లీకి పిలిచి అధిష్టానం మాట్లాడుతోంది. జాబితా విడుదల తరువాత అసమ్మతి లేకుండా చూసుకునేందుకు ముందస్తు బుజ్జగింపులు జరుగుతున్నాయి. కెసి వేణుగోపాల్ నివాసంలో అర్ధరాత్రి వరకు తుది జాబితాపై చర్చలు కొనసాగుతున్నాయి. జాబితా విడుదల ముందే ఉదయం 11 గంటలకు మీడియాతో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమ మార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, థాక్రే మాట్లాడనున్నారు. మరో వైపు ఢిల్లీకి రావాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కెఎల్‌ఆర్‌ను కూడా ఢిల్లీ రావాలని కెసి వేణుగోపాల్ ఫోన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News