Sunday, January 19, 2025

కాంగ్రెస్ సీనియర్లకు క్లాస్ పీకిన ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ వివిధ కమిటీలలో జరిగిన నియామకాలు, తలెత్తుతున్న గొడవలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం విచారం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులకు ఆమె ఫోన్ చేసి అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ నాయకులు, తర్వాత టిడిపి నుంచి వచ్చిన నాయకుల మధ్య పొసగడంలేదని తెలుస్తోంది. క్రిస్మస్ తర్వాత పార్టీ అధిష్ఠాన నాయకులను వచ్చి కలవమని ఎనిమిది మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు తాఖీదు అందింది. ప్రస్తుతం అధిష్ఠాన నాయకులు పార్లమెంటు సమావేశంలో బిజీగా ఉన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలిపేందుకు ఎఐసిసి సెక్రటరీగా నదీమ్ జావేద్‌ను తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానం పంపింది. జావేద్ తెలంగాణకు వచ్చి ఇక్కడి నాయకులతో చర్చించారు. కొత్త నియామకాలపై వారి అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలో తీవ్ర విభేదాలున్నాయని, అది ఎప్పుడైనా చేయి దాటిపోవచ్చని ఆయన వెంటనే ప్రియాంక గాంధీకి తెలిపారు. వీలయినంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు.

జనవరి 26 నుంచి మొదలయ్యే ‘హాథ్ సే హాథ్ జోడో’ కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా పనిచేసేలా పార్టీ చూడబోతుంది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కొనసాగిన చోటల్లా ఈ కార్యక్రమాని నిర్వహించబోతున్నారు. పార్టీలోకి వలస వచ్చిన గ్రూప్‌గా భావిస్తున్న 11 మంది సభ్యులు తమ రాజీనామాలను తెలంగాణ ఎఐసిసి ఇన్‌ఛార్జీ మాణికం ఠాగోర్‌కు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నట్లు రెండు గ్రూపులూ చెప్పుకుంటున్నాయి. ఎవరికి వారు తమ వాదనలను, సమస్యలను ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలకు నివేదించారు. పనితీరుపై రెండు వర్గాలకు భేదాభిప్రాయాలున్నాయి. అసమ్మతి నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి మాటామంతీ జరపాలనుకుంటున్నారని, ఆ తర్వాత విషయాలను హైకమాండ్‌కు తెలుపాలనుకుంటున్నారని తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి సభ్యులు 12 మంది చేత రేవంత్ రెడ్డియే రాజీనామాలు చేయించారని కొంత మంది కాంగ్రెస్ సభ్యులు తప్పు పడుతున్నారు. తమ జిల్లాల్లో పాదయాత్రను నిర్వహించడానికి టాప్ అండ్ సీనియర్ నాయకులను అనుమతించాలని వారు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News