Thursday, January 23, 2025

ఆంధ్ర నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నాయకుల చేతిలో తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తున్న కారణంగానే ఉచిత విద్యుత్ విషయంలో టిపిసిసి అధ్యక్షు లు రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ముషీరాబాద్ ఎ మ్మె ల్యే ముఠా గోపాల్ విమర్శించారు. రైతులకు 24 గంటలకు విద్యుత్ సరఫరా అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాంనగర్ చౌరస్తా లో ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన సభ, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గో పాల్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉ ద్యమ సమయంలో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ తెలంగాణ ప్ర జలను యద్దేవా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తె లంగాణ పంట పొలాలకు 24 గంటలు నీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉం చేందుకు నిరంతర విద్యుత్ విధానాన్ని సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా తెలంగాణ పంట దిగుబడి విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నా రు.

రేవంత్ రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలను యావత్తు తెలంగాణ రైతాంగం వ్యతిరేకిస్తోందన్నారు.కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వివిధ డివిజన్ల అద్యక్షులు రావులపాటి మోజస్, నర్సింగ్ ప్రసాద్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, రాకేష్, మన్నె దామోదర్ రెడ్డి, కొండా శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముఠా నరేష్, ముచ్చకుర్తి ప్రభాకర్, షరీఫుద్దీన్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News