Thursday, December 19, 2024

ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం రాష్ట్రమే నిర్మిస్తోంది

- Advertisement -
- Advertisement -

అందుకే రాష్ట్ర ప్రభుత్వమే దక్షిణ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించింది
రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే రీజనల్ రింగ్ రోడ్డును గత ప్రభుత్వం పక్కన
పడేసింది ఆరు లేదా ఎనిమిది లైన్లతో ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మిస్తాం
అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో టెండర్లు పిలుస్తాం ప్రాజెక్టు డైరెక్టర్‌గా
దాసరి హరిచందన నియామకం మామునూరు ఎయిర్‌పోర్టును
అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు ఇంకా
కేంద్రం నుంచి లభించని గ్రీన్‌సిగ్నల్ డిసెంబర్ మొదటివారంలో
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ దక్షి ణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని రో డ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ గత ప్రభుత్వం హయాంలో ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రిం గ్ రోడ్డు) ను 201718లో ప్రతిపాదించారని, ఇప్పటిదాకా ఒక్క పనిని కూడా మొదలు కాలేదని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్ లాం టి ఆర్‌ఆర్‌ఆర్‌ను గత ప్రభుత్వం నిర్లక్షం చేసిందన్నారు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందన్నారు. రాజకీయాల్లో ఈగోలకు తావులేదన్నా రు. మనమంతా ప్రజల కోసం పనిచేస్తున్నామని, జవాబుదారీగా ఉండాలని ఆయన చెప్పారు ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు నిర్మాణం మొదట కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారని, కానీ, ఇప్పటికీ కేంద్ర ప్రభు త్వం పూర్తిస్థాయిలో దీనిపై క్లారిటీ, కమిట్ మెం ట్ ఇవ్వలేదని
ఆయన తెలిపారు. దీంతో పనులు ఆలస్యం జరిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం జరుగుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం స్వయంగా నిర్మించాలనుకుంటుందన్నారు.

ఈ రోడ్డును 6/8 లేన్‌లో ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో (ఢిల్లీ – ముంబాయి ఎక్స్ ప్రె స్ వే, ముంబయి టు -నాగపూర్ ఎక్స్‌ప్రెస్ వే, చెన్నై టు -కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ వే, గుజరాత్ స్టేట్ రీజనల్ రింగ్ రోడ్డు) నిర్మించినట్టుగా ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణంతో ఫోర్త్ సిటీకి, ఎయిర్ పోర్ట్‌కు కనెక్టివిటీ కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, లాజిస్టిక్, మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ అధ్యయనం, దానిని ప్రతిపాదించడం కోసం స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఆఫీసర్స్ కమిటీని నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు.

రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేశామని దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ ఐఎఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించినట్టు మంత్రి తెలిపారు. ఫైనాన్సియల్ అడ్వైయిజర్ రోడ్డు నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంకు, జైకా, ఏడిబీ (ఎషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు) మొదలైన ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ఇప్పటి వరకు 94 శాతం భూసేకరణ పూర్తి చేశామని, రైతులకు నష్టం నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ఎన్‌హెచ్‌ఏఐకి పూర్తి సమాచారం, సహకారం అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఇక వాళ్ల చేతుల్లోనే ఉంటుందన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం కొరకు 1,895 హెక్టార్ల భూమి సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,862 హెక్టార్ల భూమి కొరకు 3 (డి) నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన తెలిపారు. 1,320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డుల ప్రిపరేషన్ జరిగిందని, 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతుందన్నారు. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసుల్లో ఉందని, ఇవన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తామని మంత్రి తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో మామునూరు ఎయిర్‌పోర్టు..

మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అడ్డంకిగా మారిన 150 కిలోమీటర్ల దూరం నిబంధనను జిఎంఆర్ ఉపసంహరించుకునేలా 205 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం అదిగో మామునూర్ ఎయిర్ పోర్ట్ అంటూ ఊరించిందని, కానీ, ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆయన ఆరోపించారు. ఈ ఎయిర్ పోర్ట్‌ను రాబోయే 8 నెలల కాలంలో మొదటిదశను ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు.

మొదటిదశలో మామునూర్ ఎయిర్ పోర్ట్‌ను స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక రెండో దశలో ఇంటర్ నేషనల్ విమానాలు (పెద్ద విమానాలు ఏ320, బి737), కార్గో విమానాలు నిలిపేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు వచ్చాయని మంత్రి ప్రకటించారు. రానున్న రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధించి వాటి నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరవిమానయానశాఖ మంత్రి రాంమ్మోహన్ నాయుడుతో చర్చించామన్నారు.

హైదరాబాద్ టు -విజయవాడ రహదారి అభివృద్ధి

హైదరాబాద్‌విజయవాడ (ఎన్‌హెచ్ 65) విస్తరణ పనులు చేపట్టాలని తాను అడిగిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ హైవేను మంజూరు చేశారని కోమటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డిపిఆర్ ఫైనల్ స్టేజీలో ఉందని, డిపిఆర్ పూర్తైన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఉప్పల్ ఫ్లైఓవర్ మేడిపల్లి నుంచి సిపిఆర్‌ఐ వరకు దాదాపు పూర్తయ్యిందని మంత్రి చెప్పారు. ఫ్లైఓవర్ పూర్తి కావడానికి ఇంకా ఏడాదిన్నర పడుతుందన్నారు.

శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు

శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుతమైన జాతీయ రహదారి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. చత్రపతి శివాజీ మహారాజ్ ప్రయాణించిన రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల ముసుగులో బిఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఇలాగే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లా అని ఆయన ప్రశ్నించారు. రేప్ కేసులో ఉన్న ఓ రౌడీ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఐఏఎస్‌పై దాడులు చేస్తుంటే ఖండించాల్సింది పోయి తమ కార్యకర్తేనని సిగ్గులేకుండా కెటిఆర్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలన

అనంతరం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ మొదటివారంలో పనులు పూర్తి చేసేలా అధికారులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. లక్షలమంది సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజల బాగుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేళశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News