- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. 1000 కేసుల నుంచి 2000 కేసుల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో దాదాపుగా 75 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా 1914 మంది కరోనా పాజిటివ్రాగా ఐదుగురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 3.03 లక్షలకు చేరుకోగా 1734 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 11617 మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 393 కేసులు నమోదైనట్టు సమాచారం.
- Advertisement -