Sunday, September 22, 2024

తెలంగాణలో కొత్తగా 165 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Telangana registered 148 new corona positive cases

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం ఉదయం వరకు 165 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు చనిపోయారు. తెలంగాణ ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.97 లక్షలకు చేరుకోగా 1623 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.93 లక్షల మంది కోలుకోగా 1715 మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 35 కేసులు నమోదైనట్టు సమాచారం. తెలంగాణలో 83.9 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసుల విషయంలో తెలంగాణ పదకొండో స్థానంలో ఉండగా తొలి స్థానంలో మహారాష్ట్రం(20.81 లక్షలు), వరసగా కేరళ(10.21 లక్షలు), కర్నాటక(9.46 లక్షలు), ఆంధ్రప్రదేశ్(8.89 లక్షలు)లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News