- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు చనిపోయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 2.9 లక్షలకు చేరుకోగా 1571 మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.84 లక్షల మంది కోలుకోగా 4458 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఇప్పటి వరకు 73.5 లక్షల మంది కరోనా టెస్టులు చేశారు. కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ (8.85 లక్షలు) మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర (19.74 లక్షలు) ఉండగా రెండో స్థానంలో కర్నాటక (9.28 లక్షలు) ఉంది.
- Advertisement -