Monday, December 23, 2024

ఉమ్మడి పాలనలో అధోగతిలో తెలంగాణ పల్లెలు

- Advertisement -
- Advertisement -

దేవరుప్పుల : స్వరాష్ట్రంలో గ్రామస్వారాజ్యం అవిర్భంవించి స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్ది, మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని చిప్పరాళ్లబండతండా, ధరావత్‌తండా గ్రామ పంచయతీ భవనాల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే పాలన అందించేందుకు, ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సంస్కరణలతో నిధులు, విధులు వచ్చి అభివృద్ధి పథంలో పల్లెలు చారీత్రాత్మకంగా ప్రగతి పథంలో నడుస్తున్నాయని తెలిపారు. గత పాలకుల పల్లెల్లో ప్రజలు హరిగోస పడ్డారని గ్రామపంచాయతీ భవనాలకు దిక్కులేదని, పల్లెల్లో దుర్బర పరిస్థితలు నుంచి కెసిఆర్ నేతృత్వంలో సకల సౌకర్యాలు కల్పించుకున్నామని అన్నారు.

నాడు నెలకొన్న పరిస్థితులు నేడు స్వరాష్ట్రంలో కల్పించుకున్న వనరులను జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రజలకు వివరించారు. ఆరువై ఏళ్ల ఆంద్ర పాలకుల పాలనలలో తెలంగాణ వెనుకబడిపోయిందని , కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమ, అభివృద్ధ్ది పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల మన్ననలు పొందుతూ బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం సాహాసోపేత నిర్ణయాలతో సుపిరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువచేసేందుకు జిల్లా పనఃర్విభజన చేసి నూతన మండలాలు, గ్రామ పంచాయతీలతో అభివృద్ధి ఫలాలను చేరువచేశామని తెలిపారు.

ఈ నెలకరులోగా అర్హులందరికి కొత్త ఫిన్షన్లు మంజూరూ చేస్తామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని కోరారు. ప్రతిపక్షాల వాళ్లు చెప్పె మాటలను నమ్మవద్దని, వారికి దీటుగా సమాదానలు చెప్పాలని సూచించారు. మరోమారు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, జెడ్పిటిసి పల్లా భార్గవి సుందర్‌రాంరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు తీగల దయాకర్, గ్రామ సర్పంచి గేమానాయక్, వైస్‌ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, నాయకులు కొత్త జలందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బిక్షపతి, యాదగిరి, దేవానాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News