Saturday, December 28, 2024

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

- Advertisement -
- Advertisement -

అంతర్గాం: సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలన్ని మారిపోయాయని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామా లను నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో గురువారం మండలంలోని మూర్‌మూర్ గ్రామంలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్దిదారలకు యూనిట్ల మంజూరు పత్రాలు అందించారు. గ్రామంలో పని చేస్తున్న అంగ న్‌వాడీ, ఆశ వర్కర్, సపాయి కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శులను నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదేనన్నారు.

దేశంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ది చేసిన మంచినీరు సరఫరా చేస్తున్నది మనమేనన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీలు, ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటెషన్, వైకుంఠదామం, డపింగ్ యార్డు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పల్లెలన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో మారి పోయాయన్నారు.

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని, రైతులకు సాగునీరు అందించకుండా రోడ్డున పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణపల్లి వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి 27 ఎల్ ద్వారా 20 వేల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సకల జనుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ని మరోమారు అక్కున చేర్చుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్‌ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ దివాకర్, సర్పంచ్‌లు బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, ధరణి రాజేష్, ఎంపీడీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి, ఎలుక కొండయ్య, శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News