- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 887 మందికి కరోనా పాజిటివ్ రాగా నలుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.08 లక్షలకు చేరుకోగా 1701 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 5511 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా 3.01 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1.02 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర(28.12 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా కేరళ(11.24 లక్షలు), కర్నాటక(9.97 లక్షలు), ఆంధ్రప్రదేశ్(9.01 లక్షలు), తమిళనాడు(8.86 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి.
- Advertisement -