Thursday, December 19, 2024

రైతులకు గుడ్ న్యూస్… 2 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో రూ. 2 లక్షల రుణమాఫీ పై మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ రుణమాఫీకి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు అవసరమని కేబినెట్ ప్రాథమిక అంచనా.

రేపు రైతు భరోసాపై ఖమ్మం నుంచి అభిప్రాయాల సేకరణ ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతు భరోసా విధివిధానాల కోసం ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ కమిటీ కీలక రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News