Wednesday, January 22, 2025

బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి, చేనేత వస్త్రాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వస్త్రాలు బ్రిటీష్ పార్లమెంటులో ప్రతిబింబించాయి. ప్రపంచ హెరిటేజ్ వీక్ ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, భారతదేశ నేత సంప్రదాయాలపై ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంస్కృతీ సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి హస్త శిల్పం అని పేరు పెట్టారు, దీనికి యూకె మాజీ ఇంధన, వాతావరణ మార్పుల మంత్రి , బారోనెస్ వర్మ హోస్ట్ చేశారు. సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని పరిరక్షించడం ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశంసించారు. పోచంపల్లి చేనేత, తెలంగాణ జానపద సంప్రదాయాలను మహంకాళి అమ్మవారికి నృత్య నివాళి ద్వారా వనమాల గోపతి సమర్పించగా, మరో తెలుగు అమ్మాయి అనన్య విలిన అరుణాచల్ ప్రదేశ్‌లోని అపటాని గిరిజన నృత్యాన్ని ప్రదర్శించారు, ఇది విభిన్న సంస్కృతుల మేళవింపుకు నిజమైన ప్రదర్శనగా నిలిచింది.

రాజస్థాన్, సింధ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశాలోని చేనేత, నేత సంప్రదాయాలను చక్కగా ప్రదర్శించారు. హైదరాబాద్‌లో సింధీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నందున, అజ్రాక్ సంప్రదాయంపై డాక్టర్ లఖుమల్ లుహానా ప్రదర్శన దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్ బ్రిటీష్ పార్లమెంట్‌లో జరగడం ఇదే మొదటిసారి. ప్రముఖ గాయని, గేయ రచయిత రేణు గిడూమల్ సమర్పకులను పరిచయం చేయగా, సంస్కృతి సెంటర్ వ్యవస్థాపక ట్రస్టీ రాగసుధ వింజమూరి కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News