Monday, December 23, 2024

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్రాష్ట్ర ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు, రిమాండ్
రాజస్థాన్, జైపూర్, జోధ్‌పూర్‌లలో ఆపరేషన్
29 అకౌంట్ల ద్వారా రూ.11 కోట్ల లావాదేవీలు
వీరిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదు
దేశవ్యాప్తంగా 2223 కేసులు
31 సెల్‌ఫోన్‌లు, 37 సిమ్ కార్డులు,
13 ఎటిఎమ్ కార్డులు, 7 చెక్‌బుక్స్, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మొదటిసారి అంతర్ రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడిందన్నారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఈ ఆపరేషన్‌లో వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్‌లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయన్నారు. రాజస్థాన్, జైపూర్, జోథ్‌పూర్‌లలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు, 15 రోజుల ఆపరేషన్‌లో భాగంగా వీరిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితులు అందరూ విద్యావంతులేనని, మొత్తం 30 ఏళ్ల లోపు వారే ఉన్నారని వెల్లడించారు.

ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2223 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. అరెస్టయిన నిందితుల నుంచి 31 సెల్‌ఫోన్‌లు, 37 సిమ్ కార్డులు, 13 ఎటిఎమ్ కార్డులు, 7 చెక్‌బుక్స్, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్‌లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. రూ.11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీలు జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందని వెల్ల డించారు. దక్షిణ ఆసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్‌లా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎటువంటి లింక్ క్లిక్ చేయవద్దని, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

సైబర్ నేరస్తులపై పోలీసుల నిఘా పెరగ డంతో సైబర్ నేరగాళ్లు నగరాలు వదిలి గ్రామాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని ఆమె వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదన్నారు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితు లను పట్టుకోగలిగామని వెల్లడించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్టు చేశారన్నారు. మా బృందాలు ఎప్పటికప్పుడు నేరస్తుల కదలికలు, లోకేషన్‌లపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశపూర్వకంగానే మ్యూల్ అకౌంట్‌లను నేరస్తులకు ఇస్తున్నారన్నారు. నేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవొద్దని సూచిం చారు.

రాష్ట్రవ్యాప్తంగా 189 కేసుల్లో నిందితులు రూ.9 కోట్లు కొల్లగొట్టారన్నారు. నిందితులను అరెస్టు చేయడానికి అక్కడి లోకల్ పోలీసులు సహ కరించారన్నారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ లాస్ట్ ఆపరేషన్ కాదని, ఇది మొదటిది మాత్రమేనన్నారు. నేరాలకు పాల్ప డిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకువస్తామని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ.114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి అందజేయడం జరిగింద న్నారు. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు మ్యూల్ అకౌంట్‌లను ఓపెన్ చేసే ముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

నిందితులను కస్టడీకి తీసుకుంటాం.. వివరాలు రాబడతాం

కాంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలు సైబర్ హబ్‌లుగా ఉన్న తరుణంలో సైబర్ నేరాలకు పాల్పడే తీరు తెన్నులతో పాటు సూత్ర ధారులెవరనే దానిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్న సైబర్ కేటుగాళ్లను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనుంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టంతో పాటు విచారణ తదనంతరం మరి కొందరు సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News