Wednesday, January 22, 2025

తెలంగాణ అప్పులు రూ. 6,71,757 కోట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఏవంటే… బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023 నాటికి  అప్పులలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం పది రెట్లు పెరిగింది. రెవిన్యూ రాబడిలో రుణాల చెల్లింపు భారం 34 శాతానికి చేరుకుంది. మరో 35 శాతం ఉద్యోగుల జీతభత్యాలకు, పెన్షన్లకు వెళ్ళింది. ఈ పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదు.

2014-15 నాటికి రాష్ట్ర రుణం 72,658 కోట్లు కాగా ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో మొత్తం అప్పులు 6,71,757 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో అప్పు సగటున 24.5 శాతానికి పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లుగా ఉంది. 2015-16లో రుణ, జీఎస్డీపీ దేశంలోనే అత్యల్పంగా 15.7 శాతం ఉండగా, అది 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుతం పది రోజులకు తగ్గింది. రోజువారీ ఖర్చులకు కూడా రిజర్వు బ్యాంకుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News