Monday, January 20, 2025

దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరపాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

 

సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్ధిపేట నియోజకవర్గంలో వైభవంగా నిర్వహిద్దామని, సిద్ధిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు.

Also Read తెలంగాణకు ఎవరు కావాలి?: కట్టెటోడా..కూలగొట్టెటోడా?

స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. దశాబ్ద కాలంలో శతాబ్ధి అభివృద్ధి సాధించామని, నాడు ఉద్యమంలో ముందున్నామని, నేడు అభివృద్ధిలో ముందున్నాం. ఇవాళ అభివృద్ధికి సిద్ధిపేట అధ్యయన కేంద్రంగా మారిందని ప్రశంసించారు.

ఇతరులకు గొప్ప మార్గదర్శనంగా నిలిచామని, ఇదంతా జరిగిదంటే దీని వెనుక తీవ్రమైన ప్రయత్నం ఉందని, సిద్ధిపేట నియోజకవర్గం ప్రగతిలో అగ్రగామిగా నిలిచామని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం.. ఇలా ఏ రంగంలోనైనా సిఎం కెసిఆర్ నాయకత్వంలో గుణాత్మక మార్పు సాధించామని, 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. నాడు-నేడు సిఎం కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలన్నారు. ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలిస్తేనే అనుకున్న కార్యక్రమం సఫలీకృతం అవుతుందని, మీ అవగాహన కోసమే ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనిని, ఉద్దేశ్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని, మంత్రి హోదాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అవగాహన చేపట్టామని, ఈ దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం ఉండొద్దు. స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు గుర్తించి సహకారాన్ని అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమైతే ఈ కార్యక్రమం ప్రతీ గ్రామంలో విజయవంతం అవుతుందన్నారు. సమిష్టిగా అందరూ కలిసి ముందుకు సాగుదామని, నియోజకవర్గ స్థాయిలో బాగా చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News